Go Back

నిమ్మకాయ కొబ్బరి కొత్తిమీర రైస్

Ingredients

  • ఉడికించని అన్నం 4 కప్పులు గ్రాములు
  • లెమన్ రైస్ పౌడర్ - MTR 1 ప్యాకెట్ 100 గ్రా లేదా అరకప్పు నిమ్మరసం
  • తురిమిన కొబ్బరి ఫ్రోజెన్ లేదా తాజాది = 1 కప్పు
  • తరిగిన కొత్తిమీర = 1 కప్పు
  • పచ్చిమిర్చి - పొడవుగా కోసినవి
  • అల్లం - చిన్న ముక్కలు
  • జీడిపప్పు – 5
  • వేరుశెనగలు - 8
  • తిరగమాత కి - నూనె ఆవాలు, శనగ పప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు
  • రుచికి సరిపడ ఉప్పు MTR లెమన్ రైస్ పౌడర్ వాడితే ఉప్పు వేయక్కరలేదు

Instructions

  • చేసే విధానం:
  • ఒక బాణలిలో అర కప్పు నూనె వేయండి. వేడిగా ఉన్నప్పుడు ఎండు మిరపకాయలు, ఆవాలు వేయాలి. ఆవాలు చిమ్మినప్పుడు శనగ పప్పు, మినప్పప్పు వేసి, మరియు వేరుశెనగ మరియు జీరా వేయండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి జోడించండి. తర్వాత జీడిపప్పు వేయండి . 1 ప్యాకెట్ MTR లెమన్ రైస్ పౌడర్ జోడించండి.
  • తరువాత తురిమిన కొబ్బరిని జోడించండి. కొబ్బరి పచ్చి పోయేవరకూ వేయించండి. చల్లారగానే కొత్తిమీర వేయాలి.
  • డయాబిటిస్ ఉన్నవాళ్ళు గాని, బరువు తగాలనులునేవాళ్ళు గాని ఇక్కడ అన్నం బదులు కాలీఫ్లవర్ రైస్ (మా ముందు వంటకాల లింకు చూడండి Link to Cauliflower rice) చేసి అన్నం బదులుగా వీడియోలో లాగా కలపండి. అన్నం వేయనందు వలన మీకు తక్కువ క్యాలరీలు వస్తాయి.

Notes

ఆన్నంతో: : 4 కప్పులుఅ అన్నం తో బాగా కలపండి
అంతే! ఎంతో కమ్మని నిమ్మ,కొబ్బరి,కొత్తిమీర చిత్రాన్నం రెడీ!
ఎప్పుడు/దేనితో సర్వ్ చేయాలి:
రైతా
చిట్కాలు:
మీరు MTR నిమ్మ పొడిని పొందలేకపోతే, మీరు నిమ్మరసం 30 ml ఉపయోగించవచ్చు. టేసింగ్ తర్వాత అవసరమైతే మరిన్ని జోడించండి.
Course: Main Course