Go Back

తులసి/ వాము ఆకు వేడి పానీయం

శీతాకాలం చలి లో ఈ సుగంధ అద్భుతమైన వేడి పానీయాన్ని ప్రయత్నించండి!
Servings 2 people

Ingredients

  • కావలసినవి: 4 చిన్న లేదా 2 పెద్ద కప్పులు చేస్తుంది
  • తులసి ఆకులు 10
  • వాము ఆకులు 10
  • దాల్చిన చెక్కలు 2 అంగుళాలు
  • లవంగాలు 2
  • ఏలకులు -2
  • నల్ల మిరియాలు - 7-10
  • జీరా ¼ టీస్పూన్
  • అల్లం 2 సెం.మీ
  • ధనియా - 1 టేబుల్ స్పూన్
  • బెల్లం పొడి - 2 టేబుల్ స్పూన్లు రుచికి
  • నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్

Instructions

  • లవంగాలను. నల్ల మిరియాలు, ఏలకులు, ధనియా, జీరా మరియు అల్లం ముతగ్గా కొట్టండి .
  • తులసి మరియు వాము ఆకులను కడిగి చిన్న ముక్కలుగా కోయండి.
  • 600 ml నీరు లో అన్ని పదార్థాలను సుమారు 10 నిమిషాలు ఉడకబెట్టండి.
  • త్రాగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నిమ్మరసం వేసి, ఆపై కప్‌లలో ఫిల్టర్ చేయండి.
  • శీతాకాలంలోనూ, కాస్త ఒంట్లో నలతగా ఉన్నా రోజంతా ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని ఆస్వాదించండి!