Go Back

చింతపండు అన్నం, రైస్ కాలీఫ్లవర్ పులిహోర

Ingredients

  • వండిన అన్నం - 2 కప్పులు
  • అర కప్పు నూనె
  • 3-4 ఎర్ర మిరపకాయలు
  • ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు
  • శనగ పప్పు - 3 టేబుల్ స్పూన్లు
  • మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి పొడవుగా కోసి – 4
  • ఇంగువ - 1 టీస్పూన్
  • బెల్లం పొడి - 1 టేబుల్ స్పూన్
  • వేయించిన నువ్వుల పొడి - 3 టేబుల్ స్పూన్లు
  • కరివేపాకు - 8-10
  • పసుపు - 1 టేబుల్ స్పూన్
  • జీడిపప్పు - 10
  • వేరుశెనగ - 8
  • చింతపండు రసం - 1 కప్పు

Instructions

  • చింతపండు పులిహోర లేకుండా తెలుగువారింట పండగ జరగదు.
  • ఇక్కడ నా రెసిపీ ఇస్తున్నాను.
  • ఈ దీపావళి, సాంప్రదాయ మరియు ఆరోగ్యకరమైన పులిహోర ప్రత్యామ్నాయంతో జరుపుకోండి.
  • ఒక పాన్‌లో అర కప్పు నూనె, ఎర్ర మిరపకాయలు, ఆవాలు, శనగ పప్పు, మినప్పప్పు,పచ్చిమిర్చి, వేరుశెనగ మరియు ఇంగువ,కరేపాకు జీడిపప్పును వీడియోలో లాగా వేసి వేయించండి. ఆపై చింతపండు రసం, బెల్లం పొడి మరియు వేయించిన నువ్వుల పొడి కలపండి. ఈ సమ్మేళనాన్ని మీడియం మంటపై 10 నిమిషాలు ఉడికించండి. మీరు రుచికి సరిపడ ఉప్పును వేయండి.
  • ఒక కప్పు ఉడికించిన కాలీఫ్లవర్ రైస్ (రెసిపీ మా వెబ్ సైట్ లో ఉన్నది) తీసుకోండి.
  • దీనిలో రెండు టేబుల్ స్పూన్ల పులిహోర మసాలా కలిపి డయాబిటిక్స్, బరువు తగ్గాలనులునేవాళ్ళకూ వేరే తీయండి.
  • మిగిలిన పులిహోర మసాలాలోకి 2 కప్పుల వండిన అన్నం చేత్తో బాగా కలపండి.
Course: Main Course