Go Back

ఒవెన్లో ఉల్లిపాయ వడియాలు ఎండాకాలమే కాదు; ఎప్పుడైనా చేసుకునే మినప ఉల్లిపాయ వడియాలు.

Ingredients

  • గుండు మినప్పప్పు 1 కప్పు
  • ఉల్లిపాయలు పెద్దది = సన్నగా తరిగినవి = 1 కప్పు
  • పచ్చిమిర్చి 3-4 తరిగినవి
  • మెంతి గింజలు 8-9

Instructions

  • మినప్పప్పు, మెంతి గింజలను రాత్రంతా నానబెట్టండి. తరవాత పచ్చి మిరపకాయలు వేసి కొద్దిపాటి నీళ్లతో మెత్తగా రుబ్బుకోండి.
  • రుచికి సరిపడ ఉప్పు కలపండి.
  • ఉల్లిపాయల ను జోడించండి.
  • ఓవెన్‌ను 180 డిగ్రీలకి వేడి చేయండి.
  • ఇది వేడెక్కుతున్నప్పుడు, నాన్ స్టిక్ పాన్ లో నూనె రాసి, దానిమీద ఉల్లిపాయలతో కూడిన రుబ్బిన పిండిని సుమారు 1 అంగుళాల ముద్దలను ఉంచండి. ఓవెన్‌ టైమర్‌ను 5 గంటలకు పెట్టండి.
  • సుమారు 3-4 గంటలలో వాటిని తనిఖీ చేయండి (ఓవెన్లు అన్నీ ఒకలాగ ఉండవు). నా ఓవెన్లో, సుమారు 4-5 గంటల్లో పూర్తి అవుతాయి. పైభాగంలో గోధుమరంగు మరియు అవి చదునుగా ఉన్నప్పుడు; వాటిని తిరగవెయ్యండి. ఇంకోగంట ఈ వయిపు ఎండ నివ్వండి.
  • తరువాత తీసివాటిని మరికొన్ని గంటలు గాలిలో ఆరనివ్వండి. తర్వాత వాటిని గాలి చొరబడని డబ్బాల్లో వేయండి.

Notes

వడియాలు ఎలా చేయాలి?
1. మీరు నూనెను స్ప్రే చేసి 390 వద్ద 2-3 నిమిషాలు ఎయిర్ ఫ్రైయర్‌లో చేయవచ్చు.
2. వేడి నూనెలో వేయించవచ్చు.
3. మీరు నూనెను స్ప్రే చేసి మైక్రోవేవ్ ఒవెన్ లో ౩౦ సెకన్ల తో 1-2 నిముషాల్లో కూడా చేయవచ్చును.
దేనితో సర్వ్ చేయాలి:
అన్నం, మజ్జిగ పులుసు, సాంబార్.